భవిష్యత్తను చూడాలంటే భారత్ కు రండి : అమెరికా
మన దేశ అభివృద్ది ప్రయాణంపై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు భవిష్యత్తును చూసి ఆస్వాదించాలనుకుంటే, అందుకోసం పనిచేయాలనుకుంటే భారత్కు రండి. ఈ దేశంలో అమెరికా దౌత్య కార్యాలయానికి నాయకత్వం వహించే గొప్ప అవకాశం నాకు దక్కినందుకు గర్వపడుతున్నా అని గార్సెట్టి తెలిపారు. భారత్తో భాగస్వామ్య బంధానికి అమెరికా ఎంతో విలువనిస్తుందని తెలిపారు. మేం ఇక్కడికి పాఠాలు బోధించేందుకు రాలేదు. నేర్చుకోవడానికి వచ్చాం అంటూ ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహనను నొక్కి చెప్పారు.






