Kamal Haasan :రాజ్యసభకు కమల్ హాసన్?

మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే (DMK) ఆయన్ను రాజ్యసభకు పంపనుంది. ఈ మేరకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) తన క్యాబినేట్ మంత్రి శేఖర్ బాబు (Shekhar Babu) ద్వారా కమల్ హాసన్‌కు సమాచారం పంపినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది జులైలో డీఏంకే పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ (Rajya Sabha) సభ్యుల పదవీకాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌ను పెద్దల సభకు పంపేందుకు డీఎంకే సమాయత్తమైంది.