DK Shivakumar: బీజేపీలో చేరతారనే వార్తలపై స్పందించిన డీకే శివకుమార్

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) బీజేపీలో చేరుతారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ప్రచారాలను పూర్తిగా తోసిపుచ్చిన ఆయన.. బీజేపీ (BJP) నేతలే కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. “ముందు బీజేపీ తన ఇంటిని చక్కదిద్దుకోనివ్వండి. ఆ పార్టీలోని చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు. ఈ విషయాన్ని మా పార్టీ మంత్రులే స్వయంగా బయటపెట్టారు. ఇలాంటి విషయాలపై ఎలాంటి చర్చలు అవసరం లేదు” అని డీకే శివకుమార్ (DK Shivakumar) స్పష్టం చేశారు. ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సద్గురు జగ్గీ వాసుదేవ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవడంపై వస్తున్న విమర్శలపై కూడా డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు. ఈ సమావేశం పూర్తిగా ఆధ్యాత్మికమైందని, దీనికి రాజకీయ సంబంధం లేదని స్పష్టం చేశారు. “సద్గురు మన రాష్ట్రానికి చెందినవారు, ఆయన కావేరీ జలాల కోసం పోరాడుతున్నారు. ఆయనే స్వయంగా వచ్చి ఆహ్వానించడంతో నేను ఆ కార్యక్రమానికి వెళ్లాను” అని డీకే శివకుమార్ (DK Shivakumar) వివరించారు.
మహాశివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు డీకే శివకుమార్ (DK Shivakumar) పాల్గొన్నారు. దీంతో డీకే శివకుమార్ బీజేపీకి దగ్గరవుతున్నారనే వార్తలు ఎక్కువయ్యాయి. ఈ పరిణామాలు కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళనను రేపాయి. ఈ విషయంపై బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక స్పందిస్తూ.. డీకే శివకుమార్‌ను మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండేతో పోల్చారు. అయితే, డీకే శివకుమార్ (DK Shivakumar) పార్టీ మారతారని వస్తున్న వార్తలను కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర తోసిపుచ్చారు. ఈ క్రమంలోనే ఈ వార్తలపై డీకే శివకుమార్ స్పందించారు. “నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను, పార్టీ కోసమే పని చేస్తాను” అని ఆయన (DK Shivakumar) స్పష్టం చేశారు.