Dhananjay Munde :ఆ ఇద్దరిలో ఎవరు చెప్పినా … మంత్రి పదవికి రాజీనామా చేస్తా

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సర్పంచ్ (Sarpanch) దారుణ హత్య వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి ధనంజయ్ ముండే (Dhananjay Munde) తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడంపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఢిల్లీ లో మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్(Devendra Fadnavis) లేదా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) చెప్పినా తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమేనన్నారు. ధనంజయ్ ముండే ప్రస్తుతం మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.