Deportation Process : డీపోర్టేషన్ ప్రక్రియ కొత్తదేమీ కాదు : జై శంకర్

అమెరికా నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ ( Deportation) కొత్తదేమీ కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) పేర్కొన్నారు. తాజాగా అమెరికా 104 మంది భారతీయుల (Indians) ను స్వదేశానికి పంపించడంపై ఈ మేరకు కేంద్రమంత్రి రాజ్యసభ (Rajya Sabha)లో ప్రకటన చేశారు. వలసదారులకు సంకెల్లు వేసి పంపిస్తున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ డీపోర్టేషన్ సమయంలో వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికా (America)తో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. అమెరికాలో ఏళ్ల నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఇది ఏ ఒక్క దేశానికి సంబంధించిన విధానం కాదు. అన్నిదేశాల అక్రమ వలసదారుల ను అమెరికా వెనక్కి పంపిస్తోంది. 2012లో ఈ సంఖ్య 530గా ఉండగా, 2019లో 2 వేలకు పైగా ఉంది. అక్రమ వలసలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలి. తమ దేశస్థులు విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటే వారిని స్వదేశాలకు రప్పించడం ఆయా దేశాల బాధ్యత అని జైశంకర్ వివరించారు.