Delhi New CM: మోదీ అమెరికా పర్యటన తర్వాతే ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం!

ఢిల్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ.. ప్రభుత్వాన్ని (Delhi New CM) ఏర్పాటు చేయడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో ప్రధాని మోదీ.. అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. యూఎస్ నుంచి ప్రధాని మోదీ తిరిగొచ్చిన తర్వాతనే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారం ఏర్పాటు చేస్తుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికి ఇంకా తమ ముఖ్యమంత్రి అభ్యర్థి (Delhi New CM)ఎవరో ప్రకటించని బీజేపీ.. మోదీ తిరిగొచ్చిన తర్వాత జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేస్తోందట. ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ పాల్గొంటారని, ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలు అందుతాయని సమాచారం. అమెరికాలో మోదీ పర్యటన సమయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఢిల్లీలోని పార్టీ వర్గాలతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. మోదీ తిరిగి స్వదేశానికి వచ్చే సమయానికల్లా సీఎం అభ్యర్థిని (Delhi New CM) ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ.. సీఎం (Delhi New CM) అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరో నలుగురు కీలక నేతలు కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకున్న బీజేపీ.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చాలా జాగ్రత్తగా సీఎం అభ్యర్థిని ఎంపిక చేయాలని అనుకుంటోంది.