Delhi : ఫిబ్రవరి 16 నాటికి ఢిల్లీ సీఎం ఎంపిక!

దేశ రాజధాని ఢిల్లీ (Delhi )లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులైనా ఇంకా నూతన ముఖ్యమంత్రి (Chief Minister) ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీనిపై పార్టీ అధి నాయకత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ ఆదివారం (ఫిబ్రవరి 16) న బీజేపీ (BJP) శాసనసభా పక్ష నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో పార్టీ జాతీయ నాయకత్వం నుంచి ఇద్దరు సీనియర్ సభ్యులు కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలోనే తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు తాజాగా వెల్లడిరచాయి. ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister) పదవిని ఇద్దరికి ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్(Madhya Pradesh), యూపీ, రాజస్థాన్ (Rajasthan ) లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్న సంగతి తెలిసిందే. సామాజిక సమీకరణాలకు అనుగుణంగా ఢిల్లీ లోనూ అదే ఫార్ములాను అనుసరించాలని కమలదళం యోచిస్తున్నట్లు సమాచారం.