Delhi Exit Polls: 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం బీజేపీదే అంటున్న ఎగ్జిట్ పోల్స్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ (Delhi Exit Polls) మీద పడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఫలితాలు ఎలా ఉంటాయని అందూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. పలు ఎగ్జిట్‌పోల్స్ అంచనాల ప్రకారం ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే పట్టం కట్టబోతున్నారని తెలుస్తోంది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని బీజేపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. మొత్తానికి ఏయే ఎగ్జిట్ పోల్స్ (Delhi Exit Polls) అంచనా వేసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామా?
పీపుల్స్ పల్స్:
బీజేపీ : 51 – 60
ఆప్ : 10 – 19
కాంగ్రెస్ : 0
చాణక్య స్ట్రాటజీస్:
బీజేపీ : 39 – 44
ఆప్ : 25 – 28
కాంగ్రెస్ : 2 – 3
పీపుల్స్ ఇన్ సైట్:
బీజేపీ : 40 – 44
ఆప్ : 25 – 29
కాంగ్రెస్ : 01
రిపబ్లిక్ పీమార్క్:
బీజేపీ : 39 – 49
ఆప్ : 21 – 31
కాంగ్రెస్ : 01
టైమ్స్ నౌ:
బీజేపీ : 39 – 45
ఆప్ : 29 – 31
కాంగ్రెస్ : 0 – 1
ఏబీపీ మ్యాట్రిజ్:
బీజేపీ : 35 – 40
ఆప్ : 32 – 37
కాంగ్రెస్ : 0 – 1
పోల్ డైరీ:
బీజేపీ : 42 – 50
ఆప్ : 18 – 25
కాంగ్రెస్ : 0 – 2