CAG Report: కాగ్ రిపోర్టు ఆధారంగా సీబీఐ దర్యాప్తు జరగాలి: ఆతిశీ

ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ కొత్త సర్కారు ప్రవేశపెట్టిన కాగ్ (CAG Report) రిపోర్టు మరోసారి ఢిల్లీ లిక్కర్ పాలసీపై (Liquor Policy) రాజకీయ వివాదానికి తెరలేపింది. 2021-22లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం అమలు చేసిన కొత్త మద్యం విధానం కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2000 కోట్ల మేర నష్టం జరిగినట్లు బీజేపీ (BJP) సర్కారు ఆరోపించింది. దీనిపై ఆప్ నేత, ఢిల్లీ మాజీ సీఎం ఆతిశీ (Atishi) తీవ్రంగా స్పందించారు. కాగ్ నివేదికలోని (CAG Report) ఎనిమిది చాప్టర్లలో ఏకంగా ఏడు 2017-21 మధ్య అమలైన పాత ఎక్సైజ్ పాలసీకి చెందినవేనని ఆమె అన్నారు. “పాత పాలసీ వల్ల జరిగిన అవినీతిని ఈ రిపోర్టు (CAG Report) బయటపెట్టింది. మద్యం కాంట్రాక్టులు ఎవరి చేతికి వెళ్లాయో కూడా ఇందులో స్పష్టంగా ఉంది. హరియాణా, ఉత్తరప్రదేశ్ నుంచి అక్రమంగా మద్యం రావడం వల్లే ఢిల్లీ ప్రజలకు నష్టం వచ్చింది,” అని ఆతిశీ (Atishi) ఆరోపించారు. ఈ రిపోర్టు ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆమె (Atishi) డిమాండ్ చేశారు. పాత పాలసీలో జరిగిన అవినీతిపై విచారణ చేయాలని అన్నారు. మద్యం (Liquor Policy) కుంభకోణంపై ఆరోపణలు తీవ్రంగా మారుతున్న వేళ, ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.