Rekha Gupta :రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకురాలు రేఖ గుప్తా (Rekha Gupta) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Draupadi Murmu), ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhad) ను కలిశారు. ముందుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వైఎస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్ (Presidential Enclave)లో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ను కలిశశారు. ఈ సందర్భంగా ఇద్దరితో ముఖ్యమంత్రి ముచ్చటించారు.