Delhi : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ప్రచారానికి తెర

దేశ రాజధాని ఢిల్లీ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడిరది. 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ (Election Commission) అన్ని ఏర్పాట్లు చేసింది. చివరి రోజున రాజకీయ పార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. అధికారం కాపాడుకునేందుకు అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) అనేక హామీలతో ప్రజల్లోకి వెళ్లింది. రెండు దశాబ్దాలకు పైగా అధికారానికి దూరమైన బీజేపీ(BJP), చివరి రోజు 22 రోడ్ షోలు నిర్వహించింది. 2013కు ముందు పదిహేనేళ్లు పాలించిన కాంగ్రెస్, మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.