Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు… ముగిసిన పోలింగ్ సమయం

దేశ రాజధాని ఢిల్లీ లో శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 57.70 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడిరచింది. నార్త్-ఈస్ట్ ఢిల్లీ (North-East Delhi) నియోజకవర్గంలో అత్యధికంగా 52.73 శాతం పోలింగ్ నమోదుకాగా, న్యూఢిల్లీ లో అత్యల్పంగా 43.1శాతం పోలింగ్ రికార్డైంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu), కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar), కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఢల్లీి సీఎం ఆతిశీ, కేంద్ర మంత్రి జై శంకర్ సహా పలువురు ప్రముఖులు తొలి గంటల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.