రూ.27 కోట్ల విలువైన వాచీ స్వాధీనం
సుమారు రూ.27 కోట్ల ఖరీదైన వజ్రాలు పొదిగిన తెల్ల బంగారు వాచీని న్యూఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బిలియనీర్లు, అత్యంత ధనవంతుల కోసం ప్రత్యేకంగా ఎక్స్‌క్లూజివ్ వాచీలను తయారు చేసే అమెరికాకు చెందిన జాకోబ్ అండ్ కో కంపెనీ వాచీని స్మగ్లింగ్ చేస్తుండగా, స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు ప్రకటించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి రూ.27 కోట్ల వాచీతో పాటు, వజ్రాలు పొదిగిన బ్రాస్లేట్ మరియు ఐఫోన్ 14ప్రో మోడల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
ఈ వస్తువులకు ట్యాక్స్ చెల్లించకుండా, దొంగతనంగా తరలిస్తుండగా, గుర్తించినట్లు కస్మట్స్ అధికారులు ప్రకటించారు. న్యూఢిల్లీ లోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో సీజ్ చేసిన అత్యంత ఖరీదైన వస్తువు వాచీనే అని అధికారులు ప్రకటించారు. ఈ వాచీని 18 క్యారెట్ల తెల్ల బంగారంతో తయరు చేసిన 76 తెల్ల వజ్రాలను పొదగడం జరిగిందని అధికారులు తెలిపారు.






