అమెరికా యాత్రకు… ఈ ఏడాది 18 లక్షల మంది

ఈ సంవత్సరం మన దేశం నుంచి అమెరికాను 18 లక్షల మంది సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు కోల్‌కతాలో అమెరికా కాన్సల్ జనరల్ మెలిండా పావెక్ తెలిపారు. ఇది రెండు దేశాల ప్రజల మధ్య నుంచి సంబంధాలు ఏర్పడేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. కోల్‌కతాలో కొత్త వీసా సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సంవత్సరం భారత్ నుంచి 18 లక్షలకు పైగా ప్రజలు అమెరికాను సందర్శిస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. అమెరికా, భారత్ మధ్య అనేక రంగాల్లో మంచి సహకార సంబంధాలు ఉన్నాయని, రెండు దేశాల మధ్య దౌత్యపరమైన స్నేహ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆధునిక టెక్నాలజీ రంగంతో పాటు హెల్త్‌కేర్, పునరుత్పాదక ఇంధన వనరులు, అంతరిక్షరంగాల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయని తెలిపారు.
అమెరికా వీసా ప్రాసెస్ పారదర్శకంగా, సమర్ధవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమెరికాను సందర్శించుకోవాలని కోరుకుంటున్న వారి సంఖ్య భారీ పెరుగుతోందని, వీరి ఆకాంక్షలకు అనుగుణంగా వీసా కోసం ఎదురుచూస్తే సమయాన్ని సాధ్యమైనంతగా తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2023లో భారత్ లో అమెరికా కాన్సలెట్స్ రికార్డు స్థాయిలో 14 లక్షల వీసాలను జారీ చేశారని, ఇందులో 7 లక్షలు విజిటర్స్ వీసాలు ఉన్నాయని తెలిపారు.