Priyanka Gandhi: జేపీసీ నామీనీ జాబితాలో ప్రియాంక గాంధీ!

దేశవ్యాప్తంగా ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షాల డిమాండ్‌తో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) పంపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును పరిశీలించే జేపీసీ (JPC) నామీనీ జాబితాలో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు కాంగ్రెస్ నుంచి మనీశ్ తివారీ, రణ్‌దీప్ సూర్జేవాలా, సుఖ్‌దేవ్ భగత్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.