Immigrants: వలసదారుల భద్రతకు కొత్త చట్టం?

ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లేవారు సురక్షితమైన, క్రమబద్ధమైన, ప్రవాస జీవితాన్ని గడిపేందుకు సహకరించేలా, వలసలను క్రమబద్ధీకరించేలా కొత్త చట్టాన్ని తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 1983 నాటి వలస చట్టం స్థానంలో వలసల ( ఓవర్సీస్ మొబిలిటీ సౌకర్యాల కల్పన, సంక్షేమం) బిల్లు -2024ను తేవాలని యోచిస్తోంది. 104 మంది వలసదారులను అమెరికా (America) తిప్పి పంపిన సమయంలోనే ఇది తెరమీదకు రావడం గమనార్హం. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor ) నేతృత్వంలోని విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ తన నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. మరోవైపు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్ (Jaishankar) ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తో భేటీ అయ్యారు. అమెరికా నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొత్తదేమీ కాదని జైశంకర్ అన్నారు.