Pakistan: ఆ దేశీయులకు వీసా సేవలు నిలిపివేసిన భారత్

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం (Government of India) తీవ్రంగా స్పందిస్తోంది. దాయాది పాకిస్థాన్ (Pakistan)తో దౌత్య సంబంధాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా పాక్ జాతీయులకు వీసా (Visa) సేవలు నిలిపివేసింది. వైద్యపరమైన వాటితో సహా ఆ దేశ ప్రజలకు ఇచ్చిన అన్ని వీసాలను రద్దు చేసింది. ఈ మేరకు మన విదేశాంగ శాఖ ఆదేశాలు ఇచ్చింది. పాక్ జాతీయులకు భారత్ జారీ చేసిన అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలు 2025 ఏప్రిల్ 27 నుంచి రద్దుకానున్నాయి. ఆ దేశీయులకు జారీ చేసిన అన్ని మెడికల్ వీసాలు (Medical visas) ఏప్రిల్ 29 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఈ గడువు ముగిసేలోగా వారంతా భారత్‌ను వీడివెళ్లిపోవాలి. ఈ దేశ పౌరులు పాక్‌లో పర్యటించవద్దని సూచిస్తున్నాం అని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.