Cancer In Women: మహిళల్లో క్యాన్సర్ నివారించే టీకా.. త్వరలోనే మార్కెట్లోకి!

మహిళలలో వేగంగా వ్యాపించే క్యాన్సర్‌లను (Cancer In Women) అరికట్టేందుకు కొత్త టీకా త్వరలోనే అందుబాటులోకి రాబోతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ వెల్లడించారు. ఈ టీకా 9 నుండి 16 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న బాలికలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ టీకాపై ట్రయల్స్ కొనసాగుతున్నాయని, అవి పూర్తి అయిన వెంటనే దీన్ని అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ (Cancer In Women) సమస్యను పరిష్కరించడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రతాప్‌రావ్ జాదవ్ వివరించారు. 30 ఏళ్లు మించిన మహిళలకు ఆసుపత్రుల్లో క్యాన్సర్ స్క్రీనింగ్‌ను నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయని, అలాగే వ్యాధిని సాధ్యమైనంత త్వరగా గుర్తించడానికి దేశవ్యాప్తంగా డే-కేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.
క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని రద్దు చేసినట్లు కూడా ఆయన వెల్లడించారు. ఇది క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ఖర్చును తగ్గిస్తుందని చెప్పిన ఆయన.. త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ టీకా మహిళలకు (Cancer In Women) వచ్చే రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్‌ను నియంత్రించడంలో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ వివరించారు.