AAP : ఎమ్యెల్యే అభ్యర్థులకు రూ.15 కోట్లు ఆఫర్ : ఆప్

ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP)ని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh )ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి (MLA candidate )కి రూ.15 కోట్లు చొప్పున ఆఫర్ చేశారని, ఇప్పటివరకు ఏడుగురిని సంప్రదించారని అన్నారు. ఢల్లీి అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే ఆప్ నేతల ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే ఓట్ల లెక్కింపునకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది. ఢల్లీిలోనూ పార్టీలను విచ్ఛిన్నం చేసే రాజకీయాలను మొదలుపెట్టింది. ఏడుగురు ఎమ్మెల్యేలకు బీజేపీ శ్రేణుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆప్ ను వీడి బీజేపీ (BJP)లో చేరాలని, ఇందుకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు అని సంజయ్ ఆరోపించారు. అటువంటి ఫోన్ కాల్స్ (Phone calls )ను రికార్డు చేయాలని, ఒకవేళ నేరుగా భేటీ ఐతే సీక్రెట్ కెమెరా (Secret camera) లతో వాటిని చిత్రీకరించాలని ఎమ్మెల్యేలకు సూచించామన్నారు. బీజేపీ నేతల నుంచి తమ పార్టీ అభ్యర్థులకు ఫోన్‌కాల్స్ వచ్చాయని సంజయ్ చెప్పినప్పటికీ ఎవరు చేశారనే విషయాన్ని ఆయన వెల్లడిరచలేదు.