Delhi : ఢిల్లీ లో బీజేపీ ఘన విజయం.. 27 ఏళ్ల తర్వాత రాజధానిలో

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా స్పష్టమైన ఆధిక్యం నెలకొల్పింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 47 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. ఆప్ ముఖ్య నేతలను సైతం బీజేపీ అభ్యర్థులు చిత్తుచిత్తుగా ఓడిరచారు. న్యూ ఢిల్లీలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia), సత్యేంద్రజైన్ (Satyendra Jain) తదితర కీలక నేతలు ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. దీంతో దాదాపు 27 ఏళ్ల తర్వాత రాజధానిలో కాషాయా జెండా ఎగరబోతోంది. ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఓటర్లు అవినీతిని ఓడిరచారంటూ ఆప్‌పై విమర్శలు చేస్తున్నారు.