Maha Kumbh Mela :మహా కుంభమేళాలో భూటాన్ రాజు పుణ్నస్నానం

భూటాన్ రాజు జింగ్మే ఖేసర్ నంగ్యాల్ వాంగ్‌చుక్ మహాకుంభ్ నగర్‌ను సందర్శించారు. త్రివేణీ సంఘంలో పుణ్య స్నానం చేశారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఉన్నారు. అంతకుమునుపు వీరు సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పణ తదితర పూజలు చేశారు. భూటాన్ సంప్రదాయ దుస్తుల్లో విమానాశ్రయంలో ల్యాండైన వాంగ్‌చుక్ కాషాయ రంగు కుర్తాపైజామా ధరించి పుణ్యాస్నానాల్లో పాల్గొన్నారు. వాంగ్‌చుక్(Wangchuck), యోగితో పాటు సతువా బాబాగా అందరూ పిలిచే జగద్గురు సంతోష్ దాస్ మహారాజ్(Santosh Das Maharaj) కూడా ఉన్నారు. అనంతరం భూటాన్ రాజు అక్షయ్‌వత్, బడే హనుమాన్ ఆలయాల్లో పూజలు చేశారు. డిజిటల్ మహా కుంభ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను కూడా సందర్శించారు. వాంగ్‌చుక్ సోమవారం థింపూ నుంచి లక్నోకు చేరుకున్నారు.