Beating Retreat : ఢిల్లీలోని విజయ్‌చౌక్‌లో అట్టహాసంగా బీటింగ్ రిట్రీట్

భారత గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. విజయ్‌చౌక్ వద్ద సైనిక, పారామిలిటరీ దళాలు నిర్వహించిన బీటింగ్ రీట్రీట్ (Beating Retreat) కార్యక్రమం అలరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi’s Murmu), ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖండ్ (Jagdeep Dhankhand), ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ దళాలకు చెందిన వాయిద్య బృందాలు లయబద్దంగా సంగీత కార్యక్రమం నిర్వహించాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలు బీటింగ్ రీట్రీట్‌తో ముగుస్తాయి.