ప్రపంచంలోనే మొట్టమొదటిది.. పుణేలో

టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్‌జీ బైక్ ఫ్రీడమ్ 125ను ఆవిష్కరించింది. పుణెలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో బజాజ్ ప్రీడమ్‌ను లాంచ్ చేశారు. ఇది పెట్రోలు, సిఎన్‌జి రెండు విధాలుగా పని చేస్తుంది. బజాజ్ ఫ్రీడమ్ సిఎన్‌జీ బైక్ మూడు వేరియట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.95,000 నుంచి ఉంటుంది. ఈ కొత్త బైక్‌ను ప్రైవేశపెట్టడం ద్వారా ఈ మోటార్ సైకిల్ మార్కెట్‌లో 25 నుంచి 26 శాతం వాటాను కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. ఈ బైక్ ఫుల్ ట్యాంక్ సామర్థ్యంతో 330 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. ఇది 1 కిలో సీఎన్‌జిపై 102 కి.మీ. మైలేజీని ఇస్తుంది. అయితే మార్కెట్లో బజాజ్ ఆటో షేర్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.