Atishi :సీఎం పదవికి ఆతిశీ రాజీనామా

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆతిశీ (Atishi) రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena )ను కలిసిన ఆతిశీ, తన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ శాసనసభను రద్దు చేశారు. శనివారం వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ (Aam Aadmi Party )ని బీజేపీ (BJP) ఓడిరచింది. ఈ నేపథ్యంలో సీఎం పదవికి ఆతీశీ రాజీనామా చేశారు.