Arvind Kejriwal: ఢిల్లీలో ఘోర పరాజయంపై పెదవి విప్పిన కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదే ధీమాతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఫలితాలు గట్టి షాకిచ్చాయి. ఆప్ చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు (Arvind Kejriwal) మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి అగ్రనేతలు కూడా దారుణంగా ఓడిపోయారు. అయితే ప్రస్తుత సీఎం ఆతిషీ మాత్రం నెగ్గడం ఈ పార్టీకి కొంత ఊరటనిచ్చింది. ఈ ఘోర పరాజయంపై కేజ్రీవాల్ (Arvind Kejriwal) పెదవి విప్పారు. ప్రజల తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నామని చెప్పిన ఆయన.. ప్రజా నిర్ణయాన్ని శిరసావహిస్తామన్నారు. అలాగే ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలియజేశారు. ఈ క్రమంలో తన రాజకీయ ప్రస్థానం గురించి కూడా ప్రస్తావించిన (Arvind Kejriwal) కేజ్రీవాల్.. ‘ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఈ ఓటమితో నా స్ఫూర్తి దెబ్బతింటుంద అనుకోవట్లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడిన ఆప్ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు’ అని చెప్పారు. అలాగే తమ పాలనలో ఢిల్లీలో చేసిన అభివృద్ధిని కూడా కేజ్రీవాల్ (Arvind Kejriwal) గుర్తుచేశారు. గత పదేళ్లలో ఢిల్లీలో తాగునీరు, విద్యుత్ సహా అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చాం, ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల వెంటే ఉంటాం అని స్పష్టం చేశారు.