Delhi Election: ఢిల్లీలో షాకింగ్ ఫలితాలు.. కేజ్రీవాల్, సిసోడియా ఓటమి..!

ఢిల్లీ ఎన్నికల్లో (Delhi Election Results) ఆమ్ ఆద్మీ పార్టీ దారుణంగా ఓడింది. ముఖ్యంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఓటమి ఎవరూ ఊహించనిది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్.. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో 4 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అంతేకాకుండా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియా కూడా ఓటమి పాలవడంతో ఆ పార్టీ పరిస్థితి.. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లయింది. జంగ్‌పురా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిసోడియా 600 పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. జైలుకు వెళ్లివచ్చిన సానుభూతి కూడా ఈ ఎన్నికల్లో సిసోడియాను ఈ ఎన్నికల్లో (Delhi Election Results) గట్టెక్కించలేకపోయింది. బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో ఆయన ఓడిపోయారు. అయితే, ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Delhi Election Results) ప్రకటించిన తొలి విజయం మాత్రం ఆప్ ఖాతాలోనే పడింది. కోండ్లి నియోజకవర్గం నుంచి తొలి ఫలితం వెలువడగా.. అక్కడ ఆప్ అభ్యర్థి కుల్ దీప్ కుమార్ గెలుపొందారు. ఇక బీజేపీకి తొలి విజయం లక్ష్మీ నగర్ అభ్యర్థి అభయ్ వర్మ రూపంలో దక్కింది.