Amit Shah : నన్ను క్షమించండి … అమిత్ షా కీలక వ్యాఖ్యలు

జాతీయ విద్యావిధానం ( ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రంపై అమలుపై తమిళనాడు- కేంద్ర ప్రభుత్వల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు(Tamil Nadu) లోని కోయంబత్తూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళం అని పేర్కొన్నారు. అటువంటి గొప్ప భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని ఆయన అక్కడి ప్రజలను కోరారు. అధికార డీఎంకే ప్రభుత్వం (DMK government ) పై ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు. 2026 ఎన్నికల్లో దేశ వ్యతిరేక పార్టీ అయిన డీఎంకే ఓటమి పాలవుతుందని, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం (NDA government) ఏర్పాటవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2024 బీజేపీ (BJP) కి చారిత్రాత్మక ఏడాదిగా నిలిచిందని అన్నారు. అదే ఏడాది నరేంద్ర మోదీ (Narendra Modi) మూడో సారి ప్రధానిగా ఎన్నికయ్యారని, చాలా ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మహారాష్ట్ర, హరియాణా, ఢల్లీి ప్రజలు బీజేపీపై విశ్వాసంతో తమకు అధికారం కట్టబెట్టారని అన్నారు. కుటుంబ రాజకీయాలను, అవినీతిని అంతం చేస్తూ 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.