Rodriguez Singh : అమెరికా మోస్ట్ వాంటెడ్ మహిళ… భారత్‌లో

అమెరికా మోస్ట్ వాంటెడ్ టాప్ 10 జాబితాలో ఉన్న ఓ నిందితురాలు భారత్‌లో ఎఫ్‌బీఐ (FBI) చేతికి చిక్కింది. ఆరేళ్ల తన కుమారుడిని కడతేర్చిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సిండీ రోద్రిగూజ్ సింగ్ (Rodriguez Singh) (40)ను అరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ (Kash Patel) వెల్లడిరచారు. ఆమెను అమెరికా (America)కు తీసుకురానున్నామని, త్వరలోనే న్యాయస్థానం ముందు నిలబెడతామనని అన్నారు. అమెరికా న్యాయశాఖ , భారత అధికారులు, ఇంటర్‌పోల్ (Interpol) సమన్వయంతోనే ఇది సాధ్యమైందని పటేల్ పేర్కొన్నారు. ఆమె ఆచూకీ తెలిపిన వారికి రూ.2.18 కోట్లు రివార్డును గతంలో ఎఫ్‌బీఐ ప్రకటించింది.