Amarnath Yatra : జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం

దక్షిణ కశ్మీర్‌లో 3,800 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఏటా వైభవంగా నిర్వహించే పవిత్ర అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) తేదీలు ఖరారయ్యాయి. జులై (July )3 నుంచి యాత్ర ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడిరచారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha) తో శ్రీ అమర్‌నాథ్ ఆలయ బోర్డు ( ఎస్‌ఏఎస్‌బీ) జరిపిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన వెల్లడిరచారు. అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గామ్ (Pahalgam) మార్గం, గాందర్‌బల్ జిల్లాలోని బాల్టాల్ (Baltal) మార్గాల న ఉంచి ఒకేసారి జులై 3న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. 38 రోజుల తర్వాత ఆగస్టు 9న యాత్ర ముగుస్తుంది అని ప్రతినిధి తెలిపారు.