గతంలో ఇచ్చిన ఆఫర్లన్నీ గౌరవిస్తాం : విప్రో

గతంలో ఆఫర్ లెటర్ పొందిన ఫ్రెషర్లు (తాజా ఉత్తీర్ణులు) అందరినీ నియమించుకుంటున్నట్లు ఐటీ సంస్థ విప్రో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దాదాపు 3000 మంది నెక్ట్స్ జెన్ అసోసియేట్స్‌ను చేర్చుకున్నట్లు వెల్లడిరచింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 10,000-12,000కు చేరొచ్చని కంపెనీ భావిస్తోంది. జెన్‌ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ విభాగాల్లో నియామకాలు ఉంటాయని కంపెనీ తెలిపింది. ప్రాంగణ ఎంపికలతో పాటు ఆప్‌క్యాంపస్ నియామకాలు జరుపుతున్నట్లు వివరించింది.