అహెడ్ శుభవార్త.. వచ్చే 12 నెలల్లో
అమెరికా (షికాగో) కేంద్రంగా కార్యకలాపాలు సాగించే క్లౌడ్, డేటా, ఇంజినీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ అహేడ్ మన దేశంలో వచ్చే 12 నెలల్లో 1,000 మందికి పైగా ఉద్యోగుల్ని నియమించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. గురుగ్రామ్‌లో ఈ కంపెనీ సర్వీస్ డెలివరీ కార్యాలయాన్ని ప్రారంభించింది. అమెరికా వెలుపల ఈ సంస్థ ఏర్పాటు చేసిన తొలి కార్యాలయం ఇదే. అమెరికాకు బటయ మా తొలి డెలివరీ కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేయడం ద్వారా దేశీయంగా విన్నూతత, డిజిటల్ వృద్ధికి ఉత్ప్రేరకంగా నిలుస్తాం. దేశీయంగా మా సర్వీస్ డెలివరీని పెంచడానికి అందుబాటులో ఉన్న అసాధారణ సాంకేతిక నైపుణ్యం కలిగిన 1,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని అహేడ్ వ్యవస్థాపకుడు, సీఈవో డేనియల్ అడమానీ తెలిపారు.






