Abhishek Banerjee: ఊపిరి ఉన్నంత వరకు మమతా బెనర్జీతోనే: అభిషేక్ బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ, సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) మేనల్లుడు అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) తన రాజకీయ భవిష్యత్తు గురించి స్పష్టతనిచ్చారు. అభిషేక్ బెనర్జీ, ఆయన మేనత్త మమతా బెనర్జీ మధ్య విభేదాలున్నాయని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. “ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు నా ప్రయాణం మమతా బెనర్జీతోనే. గొంతు కోసినా బీజేపీలో చేరను” అని ఆయన (Abhishek Banerjee) స్పష్టం చేశారు.
కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన టీఎంసీ కార్యకర్తల సమావేశంలో అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee).. పార్టీ క్యాడర్‌తో మాట్లాడారు. “కొంతమంది నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారెవరో నాకు తెలుసు” అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా, టీఎంసీ (TMC) మాజీ నేతలు ముకుల్ రాయ్, సువేందు అధికారి పేర్లను ప్రస్తావించారు. “నేను మోసగాణ్ని కాదు. నా మెడ విరిచినా, నా నాలుక చీల్చినా బీజేపీలో చేరను. మమతా బెనర్జీ జిందాబాద్!” అని ప్రకటించారు. తనకు, మమతా బెనర్జీకి (CM Mamata Banerjee) మధ్య విభేదాలున్నాయని ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు. ‘ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు నేను టీఎంసీలోనే ఉంటాను. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు, స్వార్థ ప్రయోజనాల కోసం స్వార్థ రాజకీయాలు చేస్తున్న ముకుల్ రాయ్, సువేందు అధికారి ద్రోహులు’ అని ఆయన (Abhishek Banerjee) అన్నారు.
https://twitter.com/i/status/