Atishi : అందువల్లే నూతన సీఎం ప్రకటన జాప్యం : ఆతిశీ

ఢిల్లీ నూతన సీఎం, మంత్రివర్గాన్ని ప్రకటించే విషయంలో జాప్యంపై ఢిల్లీ ఆపద్ధర్మ సీఎం ఆతిశీ (Atishi) బీజేపీని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం గల నేతలు ఎవరూ లేనందున బీజేపీ (BJP) ఇంకా అభ్యర్థిని ప్రకటించట్లేదని దుయ్యబట్టారు. ఎన్నికల్లో గెలుపొందిన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో(MLA) ఒకరిపైనా కూడా ప్రధాని మోదీ (Modi) కి నమ్మకం లేదని, అందుకే నూతన సీఎం (CM)ను ప్రకటించడానికి వెనుకడగు వేస్తున్నారని అన్నారు. దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేనివారు ప్రజల అభివృద్ధికి ఎలా పని చేస్తారని ప్రశ్నించారు.