Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఎన్నికల వేళ ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా

ఐదు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న వేళ ఢల్లీిలో కేజ్రీవాల్ (Kejriwal )కు గట్టి షాక్ తలిగింది. బీజేపీ (BJP)తో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొన్న అత్యంత కీలక సమయంలో ఏడుగురు ఎమ్మెల్యే (MLA) లు ఆమ్ ఆద్మీ పార్టీని వీడారు. పార్టీలో తమ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు భావనా గౌర్(Bhavana Gaur), మదన్‌లాల్ (Madanlal)కేజ్రీవాల్‌పైనా, పార్టీపైనా విశ్వాసం కోల్పోయినట్లు తెలిపారు. ఈ మేరకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖలు పంపారు. మీ పట్ల, పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయాను. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నా. దయచేసి నా రాజీనామాను ఆమోదించండి అని భావనా గౌర్ తన లేఖలో పేర్కొన్నారు.