Indians :బహిష్కరణ జాబితాలో.. 487 మంది భారతీయులు!

అక్రమ వలసదారులను తరలింపు ప్రక్రియను జోరుగా కొనసాగిస్తున్న అమెరికా (America) 104 మంది భారతీయుల (Indians )ను వెనక్కి పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా బహిష్కరణ తుది జాబితాలో 487 మంది భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగశాఖ వెల్లడిరచింది. సంకెళ్లతో వీరిని తరలిస్తున్నారని వస్తోన్న ఆరోపణలపై స్పందిస్తూ.. వీటికి సంబంధించి అమెరికా వద్ద తమ ఆందోళన తెలియజేశామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri ) తెలిపారు. భవిష్యత్తులోని ఇలాంటివి పునరావృతం కాకుండా అమెరికాతో సంప్రదింపులు జరుపుతామన్నారు.