AAP: 32 మంది పంజాబ్ ఆప్ నేతలు టచ్‌లో ఉన్నారన్న కాంగ్రెస్.. ఆప్ రియాక్షన్ ఇదే

పంజాబ్‌లో కాంగ్రెస్-ఆప్ నేతల (AAP-Congress) పరస్పర ఆరోపణలు రాజకీయ తుఫాను రేపుతున్నాయి. తాజాగా పంజాబ్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్‌కి చెందిన 32 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు తనతో టచ్‌లో ఉన్నారంటూ బాంబు పేల్చారు. మరోవైపు, కొందరు ఆప్ (AAP) ఎమ్మెల్యేలు బీజేపీతో కూడా టచ్‌లో ఉన్నారంటూ ఆరోపణలు చేశారు. “32 మంది ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు నాతో టచ్‌లో ఉన్నారు. ఆప్ (AAP) ఎమ్మెల్యేలందరికీ ఇదే చివరి అవకాశం. టికెట్ల కోసం కొత్త పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. భగవంత్ మాన్ సైతం బీజేపీతో టచ్‌లో ఉన్నారు. కేజ్రీవాల్ కనుక మాన్‌ను తొలగిస్తే, ఆయన బీజేపీలో (BJP) చేరేందుకు రెడీగా ఉన్నారు,” అని బజ్వా చెప్పారు. బజ్వా వ్యాఖ్యలపై ఆప్ (AAP) పంజాబ్ చీఫ్, మంత్రి అమన్ అరోడా ఘాటుగా స్పందించారు. బజ్వానే బీజేపీలో (BJP) చేరతారంటూ మండిపడ్డారు. “బజ్వా ఇప్పటికే బీజేపీలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. ఆయన ఇటీవల బెంగళూరులో బీజేపీ అగ్రనేతలను కూడా కలిశారు. బజ్వాను దీనిపై రాహుల్ గాంధీ ప్రశ్నించాలి,” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.