Pratap Singh Bajwa : ఆ పని బీజేపీనే చేస్తుంది.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 32 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు తనతో టచ్‌లో ఉన్నట్లు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా(Pratap Singh Bajwa) సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొందరు ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీ (BJP)తో కూడా టచ్‌లో ఉండే అవకాశం ఉందని ఆరోపించారు. ఇదే విషయం మళ్లీ చెబుతున్నా. నాతో 32 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, వీరిలో కొందరు మంత్రులూ (Ministers) ఉన్నారు. పంజాబ్ ఆప్ చీఫ్ అమన్ అరోడా (Aman Arora)కు కూడా ఈ విషయం తెలుసు. ఆప్ ఎమ్మెల్యేలందరికీ ఇదే చివరి ఛాన్స్ అని అర్థమైంది. అందుకే టికెట్ల కోసం వారు కొత్త పార్టీల వైపు చూస్తున్నారు. సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) సైతం బీజేపీతో టచ్‌లో ఉన్నారు. కేజ్రీవాల్ ఆయన్ను తొలగిస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. నా 45 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఏనాడూ తప్పుడు ప్రకటన చేయలేదు. ఆప్ సర్కార్‌ను పడగొట్టే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదని గతంలోనే చెప్పా. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఆలోచన మాకు లేదు. ఆ పని బీజేపీనే చేస్తుంది అని జజ్వా వ్యాఖ్యానించారు.