Anti-Sikh Riots: 1984 అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల (Anti-Sikh Riots) కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు (Congress Ex-MP Sajjan Kumar) ఢిల్లీ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. సరస్వతీ విహార్ ప్రాంతంలో జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్‌దీప్ సింగ్‌ను హత్య చేసిన కేసులో సజ్జన్ కుమార్‌ను కోర్టు ఇటీవల దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికే సజ్జన్ కుమార్ మరో సిక్కు అల్లర్ల కేసులో (Anti-Sikh Riots) తిహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. అతనిపై మరిన్ని కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో (Anti-Sikh Riots) సజ్జన్ కుమార్ (Congress Ex-MP Sajjan Kumar) కేవలం పాల్గొన్న వ్యక్తి మాత్రమే కాదని, ఓ బృందానికి నాయకత్వం వహించారని కోర్టు ప్రాథమికంగా నిర్ధారించింది.