Kumbh Mela : కుంభమేళాకు హాజరైన 77 దేశాల దౌత్యవేత్తలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Kumbh Mela)కు భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైభవంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఈ క్రమంలోనే 77 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయోగ్ రాజ్(Payap Raj) చేరుకుని త్రివేణి సంగమం(Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరించారు. రష్యా, ఉక్రెయిన్ సహా అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, కామెరూన్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, పోలాండ్, బొలీవీయా తదితర 77 దేశాల దౌత్యవేత్తలు తొలిసారి ఇక్కడికి వచ్చారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhad) కుంభమేళాను సందర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఆయనకు స్వాగతం పలికారు.