11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివ్
నిర్దేశిత గడువులోగా ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయని కారణంగా దేశవ్యాప్తంగా 11.5 లక్షల పాన్ కార్డులు డీయాక్టివ్ అయ్యాయి. అనుసంధానికి ఇచ్చిన గడువు ఈ సంవత్సరం జూన్ 30తో ముగిసింది. దీంతో ఈ పాన్ కార్డులు డీయాక్టివ్ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ( సీబీడీటీ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 70.24 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 57.25 కోట్ల మంది ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేసుకున్నారని సీబీడీటీ తెలిపింది. 12 కోట్ల పాన్‌కార్డుదారులు ఆధార్‌తో అనుసంధానం చేయలేదు. ఇందులో 11.5 కోట్ల కార్డులు డీయాక్టివ్ అయినట్లు తెలిపింది.






