Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Interviews » Political Interview » Supreme court verdict on ayodhya dispute

అయ్యోధ్య శ్రీరామునిదే…. శతాబ్దాల సమస్యను పరిష్కరించిన సుప్రీంకోర్టు

  • Published By: techteam
  • November 14, 2019 / 06:41 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Supreme Court Verdict On Ayodhya Dispute

భారత చరిత్రలో మరో అధ్యాయం ప్రారంభమైంది. కోట్లాది ప్రజల ఆరాధ్యదైవం, పురుషోత్తముడు, ధర్మవిగ్రహస్వరూపుడు శ్రీరాముని జన్మభూమిపై ఉన్న వివాదానికి భారత అత్యున్నత న్యాయస్థానం తెరదించింది. భారతీయ కుటుంబ వ్యవస్థకు శ్రీరామాయణమే ఆధారం. కవికోకిల వాల్మీకీ మహర్షి రచించిన శ్రీమద్రామాయణ రామచరిత్రను గోస్వామి తులసీదాసు నుంచి ఎంతోమంది రచయితలు దేశంలో ప్రవహింపజేశారు. ఈ దేశంలో ఎందరిపేర్లలో రాముడు ఉన్నాడో…ఎన్ని ఊర్లలో శ్రీరాముని ఆలయాలు ఉన్నాయో లెక్కపెట్టలేము. ఎట్టకేలకు శ్రీరాముడు జన్మించిన ప్రదేశం అయోధ్యనే అని చారిత్రాత్మకమైన తీర్పు ద్వారా సుప్రీంకోర్టు మన ఇతిహాసాల నమ్మకాన్ని, భారతీయుల విశ్వాసాన్ని చాటిచెప్పింది.

Telugu Times Custom Ads

దశాబ్దాల అయోధ్య వివాదానికి తెరపడింది. దేశ సామాజిక జీవనాన్ని చీలికలుగా మార్చిన ఓ భావోద్వేగ అంశానికి ఏకాభిప్రాయ రీతిలో తెరపడింది. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై చారిత్రక తీర్పును వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఆలయ నిర్మాణానికి మార్గానికి సుగమం చేసింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని హిందువులకే కేటాయించింది. ఇది శ్రీరాముడు జన్మించిన భూమేనని చెప్పడానికి ఐతిహాసికంగా, చారిత్రకంగా, పురావస్తుపరంగా ఎన్నో ఆధారాలున్నాయని ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. దీనికి ప్రతిగా పవిత్ర అయోధ్య పట్టణంలో ముస్లింలకు ఓ ప్రధాన భాగంలో ఐదెకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ వివాదాస్పద స్థలంలోనే శ్రీరాముడు జన్మించాడన్న హిందువుల విశ్వాసం, నమ్మకం తిరుగులేనిదేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. శ్రీరాముడే ఈ స్థలానికి సంకేతప్రాయంగా యజమాని అన్న విషయాన్ని కూడా సుప్రీం తన తీర్పులో నిగ్గుతేల్చింది. అయితే 16వ శతాబ్దం నాటి బాబరీ మసీదును హిందూ కరసేవకులు ధ్వంసం చేయడం తప్పు అని నిర్ధారించిన న్యాయస్థానం.. ఆ తప్పిదాన్ని సవరించాల్సిందేనని రూలింగ్‌ ఇచ్చింది. అయోధ్య అంశాన్ని తాము మూడు పార్టీల మధ్య తలెత్తిన వివాదంగానే పరిగణించి పరిష్కరించే ప్రయత్నం చేశామే తప్ప మత విశ్వాసాలు, మనోభావాలతో తమ తీర్పునకు ఎలాంటి ప్రమేయం లేదని న్యాయమూర్తులు వెల్లడించారు. సున్నీ ముస్లిం వక్ఫ్‌బోర్డ్‌, నిర్మోహి అఖారా, రామలల్లా వీరజ్‌మాన్‌ మధ్య వివాదంగానే దీన్ని పరిగణించి పరిష్కరించామని వివరించారు. దాదాపు 1045 పేజీలున్న ఈ తీర్పును హిందూ రాజకీయ పార్టీలు, సంస్థలు, గ్రూపులు స్వాగతించాయి. ముస్లిం నేతలు కూడా ఈ తీర్పును తప్పుబట్టినప్పటికీ దాన్ని అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నాయకత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పును ప్రకటించి దాదాపు 500 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న వివాదానికి తెరదించింది.

ట్రస్ట్‌లో వారికి చోటివ్వండి…

వివాదాస్పద 2.7 ఎకరాల భూమిని హిందువులకు కేటాయించిన సుప్రీం కోర్టు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించేందుకు మూడు నెలల్లోగా ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముస్లింలు అయోధ్యలో తమకు నచ్చినచోట మసీదు నిర్మించుకునేందుకు ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని కేటాయించాలని ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌, న్యాయమూర్తులు బాబ్డే, చంద్రచూడ్‌, అశోక్‌ భూషన్‌, అబ్దుల్‌ నజీర్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ప్రకటించింది.

మూడు నెలల్లోగా ఒక ప్రత్యేక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించిన సుప్రీం కోర్టు ఈ ట్రస్ట్‌లో నిర్మోహి అకారా, రామజన్మభూమి న్యాస్‌ తదితర సంస్థలకు సభ్యత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 1992లో బాబ్రీ మసీదును నేలమట్టం చేయటం చట్ట విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. వివాదాస్పద భూమి లోపల ఒక కట్టడం ఉన్నదంటూ ఆర్కియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అందజేసిన నివేదిక ఆధారంగా సుప్రీం తీర్పు ఇవ్వటం గమనార్హం. వివాదాస్పద భూమిని హిందువులకు కేటాయించి దేవాలయాన్ని నిర్మించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీకి అప్పగించటం, ముస్లింలు తమకు నచ్చినచోట మసీదును నిర్మించుకునేందుకు సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని ఆదేశించటం ద్వారా ఇటు హిందువులు, అటు ముస్లింలకు సుప్రీం కోర్టు న్యాయం చేసింది. ముస్లింలు గత 300 సంవత్సరాల నుండి బాబ్రీ మసీదులో నమాజు చేస్తున్నట్లు దాఖలాలు లేవు కానీ హిందువులు మాత్రం ఎడతెరిపి లేకుండా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సాక్ష్యాలు చెబుతున్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో పదాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించింది.

పురావస్తుశాఖ నివేదికే కీలకం….

వివాదాస్పదభూమి లోపల దేవాలయం వంటి నిర్మాణాలు ఉన్నాయన్న భారత ఆర్కియోలాజికల్‌ సర్వే సంస్థ నివేదికను ప్రామాణికంగా తీసుకున్నా అక్కడ దేవాలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించినట్లు నివేదికలో పేర్కొనలేదని వివరించింది. మత విశ్వాసం వ్యక్తిగతమైనప్పటికీ అయోధ్య రాముడి జన్మభూమి అనే హిందువుల విశ్వాసం తప్పు అని నిరూపించే సాక్ష్యాలేవీ తమ ముందుకు రాలేదని కోర్టు చెప్పింది. శ్రీరాముడు ఇక్కడే జన్మించాడనేందుకు వివాదాస్పదభూమి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆధారాలు ఉన్నాయనే వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. వివాదాస్పద భూమి హిందువుల మతపరమైన ప్రాంతం అనేది సీతమ్మవారి వంటగది, శ్రీరాముడి అరుగు (చబూత్రా), సరుకుల గది (భండార్‌ గ్రిహ్‌) నిరూపిస్తున్నాయని సుప్రీంకోర్టు తమ తీర్పులో పేర్కొన్నది. వివాదాస్పద బాబ్రీ మసీదు-రామజన్మభూమి కట్టడంలో శ్రీరాముడి విగ్రహాలను 1949 డిసెంబర్‌ 22-23 తేదీ మధ్యరాత్రి పెట్టారన్న అలహాబాదు హైకోర్టు అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు ఆమోదించింది. మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా భూమి యాజమాన్యాన్ని నిర్దారించలేము కానీ వివాదాలను పరిష్కరించేందుకు అవి సూచికలని ధర్మాసనం అభిప్రాయపడింది. రామజన్మభూమి ‘జూరిస్టిక్‌’ వ్యక్తికాదని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ జూరిస్టిక్‌ అనే పదానికి గల స్పష్టమైన అర్థాన్ని న్యాయమూర్తులు తీర్పులో వివరించలేదు.

శ్లోకాలను పరిశీలించిన సుప్రీం

శతాబ్ద కాలంగా సాగిన, ముఖ్యంగా మతపరంగానూ రాజకీయంగానూ పెనవేసుకుపోయిన అయోధ్య వివాద పరిష్కారానికి సుప్రీం ధర్మాసనం చారిత్రక ఆధారాలతోపాటు పౌరాణిక ఇతిహాసాలనూ లోతుగా పరిశీలించింది. శ్రీరాముడి ప్రస్తావనతో కూడిన వాల్మీకి రామాయణం, స్కంధ పురాణాలను సైతం శోధించింది. తాము ఇవ్వబోయే తీర్పు తరతరాలుగా నిలిచిపోయేది కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లోనూ పునాది లేకుండా ఉండకూడదన్న బలమైన అభిప్రాయంతోనే సుప్రీం ధర్మాసనం ఈ అంశాలను పరిశీలించింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలమే శ్రీరాముడు పుట్టిన ప్రదేశమని సంబంధిత పార్టీలు ఎన్నో ఆధారాలు ఇచ్చినప్పటికీ సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం పురాణాల్లో ఈ ప్రాంత ప్రస్తావనకు సంబంధించిన అంశాలను సైతం అవగతం చేసుకుంది. ముఖ్యంగా వాటిలోని శ్లోకాలను లోతుగా శోధించింది. బాబ్రీ మసీదు నిర్మించినట్టుగా చెబుతున్న 1528 ముందునాడే ప్రచారంలో ఉన్న మతపరమైన శ్లోకాలను విశ్లేషించింది. వీటన్నింటిని కూడా హిందూ పార్టీలు సుప్రీంకు నివేదించాయి. మతపరమైన గ్రంథాలే హిందూయిజానికి మూలమని, హిందువుల మత విశ్వాసానికి అవే కీలకమని సుప్రీం తన తీర్పులో తెలిపింది. ముఖ్యంగా శ్రీరాముడి గురించి, ఆయన చర్యల గురించి వాల్మీకి రామాయణంలో చాలా విపులంగా ప్రస్తావన ఉందని ధర్మాసనం వెల్లడించింది. క్రీస్తుపూర్వానికి ముందే రాసినట్టుగా చెబుతున్న వాల్మీకి రామాయణంలోని శ్లోకాలు శ్రీరాముడికి సంబంధించి లోతైన వివరాలు అందించాయని తెలిపింది. అలాగే, శ్రీరాముడి జన్మం గురించి, అప్పట్లో అయోధ్యలో గ్రహగతుల గురించి కూడా వాల్మీకి రామాయణంలోని శ్లోకాలు వెల్లడించినట్టుగా సుప్రీం పేర్కొంది. ఇందులోని 10వ శ్లోకం కౌసల్యాదేవికి రాముడు జన్మించినట్టుగా ప్రస్తావన ఉందని, ఆయనే మొత్తం భూమండలాన్ని ఏలతాడన్న భావనను వాల్మీకి అందులో వ్యక్తం చేశాడని ధర్మాసనం వివరించింది. రాముడి జననంతో అయోధ్య కూడా ఆనంద పారవశ్యంతో ఉప్పొంగిందన్న విషయాన్ని వాల్మీకి తన శ్లోకాల్లో ప్రస్తావించినట్టు తెలిపింది. ఇందులోని అనేక శ్లోకాల్లో రామజన్మ భూమి ప్రస్తావన ఉందన్న విషయాన్ని వెల్లడించింది. అలాగే, తులసీదాస్‌ రాసిన రామచరిత మానస్‌లోని అనేక అంశాలు ఈ వివాదాస్పద స్థలం రాముడు జన్మించిందేనన్న విషయాన్ని స్పష్టం చేసినట్టుగా సుప్రీం పేర్కొంది.

వీటన్నింటినీ పరిశీలిస్తే రాముడు అయోధ్యలోనే జన్మించాడన్న హిందువుల నమ్మకానికి మరింత బలం చేకూరేదిగా ఉన్నాయని సుప్రీం వ్యాఖ్యానిం చింది. 1528కి ముందే రాముడు ప్రస్తావనతో కూడిన ఎన్నో మతపరమైన గ్రంథాలు ఉన్నాయని, వాటన్నింటి ఆధారంగానే రాముడు పుట్టింది అయోధ్యలోనన్న నమ్మకం తరతరాలుగా హిందువుల్లో బలపడుతూ వచ్చిందని తెలిపింది.

పర్యాటకుల అభిప్రాయాలు…

శతాబ్దానికి పైగా నలిగిన అయోధ్య వివాదానికి శాశ్వతంగా తెరపడినప్పటికీ ఇందుకు సంబంధించిన తీర్పు ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. దైనందిన విచారణను చేపట్టడంతోపాటు ఈ సంక్లిష్ట సమస్యను సామరస్యపూర్వక రీతిలో పరిష్కరించేందుకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక లోతుల్లోకీ వెళ్లింది. 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు భారత్‌ను సందర్శించిన అనేక మంది యాత్రీకుల కథనాలను, వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను కూడా అంతిమ తీర్పు ఇవ్వడంలో పరిగణనలోకి తీసుకుంది. ఈ వివాదాస్పద ప్రాంతానికి సంబంధించి కాలగఠంలో కలిసిపోయిన అనేక అంశాలను కూడా వెలుగులోకి తెచ్చి, వాటిని సమతుల్య రీతిలో విశ్లేషించడం జరిగిందని సుప్రీంకోర్టు తమ తీర్పు పాఠంలో వెల్లడించింది. పర్యాటకులకు సంబంధించిన అంశాలు, ఆనాటి గెజిట్లను తాము పరిశీలించామని, తాజా సమస్య పరిష్కారానికి ఉపయోగపడే అంశాలను వాటి నుంచి వెలికి తీయగలిగామని సుప్రీం తెలిపింది. జోసెఫ్‌ టీఫెంట్‌ హేలర్‌, రాబర్ట్‌ మాంటోగోమెరీ మార్టిన్‌, పీ కార్నిజీ, అడ్వర్డ్‌ హార్న్‌టన్‌, విలియమ్‌ ఫిన్ష్‌ సహా అనేకమంది పర్యాటకులు అయోధ్యకు సంబంధించి అభిప్రాయాలు వ్యక్తం చేశారని, వాటన్నింటినీ లోతుగా పరిశీలించిన తర్వాతే దీనిపై తాము తుది నిర్ణయానికి రాగలిగామని బెంచ్‌ వివరించింది.

ఈ ప్రాంతానికి సంబంధించిన ఆనాటి భౌగోళిక చిత్రపటాలను కూడా పరిశీలించామని, పత్రాలపరమైన సాక్ష్యాలు, బొమ్మలు ఇలా ఇంకెన్నో తమకు ఉపకరించాయని, ఈ ప్రాంతంలో రామ భక్తులు దశాబ్దాలుగా ప్రార్థనలు చేస్తున్నట్టు కూడా స్పష్టమైందని, ఈ వివాదాస్పద ప్రాంతాన్నే రామజన్మ భూమి అన్న బలమైన నమ్మకం, విశ్వాసం వారిలో ఉందన్న విషయమూ వీటన్నింటి పరిశీలనతో తేటతెల్లమైందని ధర్మాసనం తెలిపింది. ముఖ్యంగా జోసెఫ్‌ టీ ఫెంట్‌ హేలర్‌ 1740 తర్వాత తన అయోధ్య పర్యటనకు సంబంధించి రాసిన పుస్తకంలోని అంశాలను తాము పరిగణనలోకి తీసుకున్నామని న్యాయమూర్తులు తెలిపారు. ఈ వివాదాస్పద ప్రాంతంలోని ఆలయాన్ని ధ్వంసం చేసి, మసీదును కట్టారన్న విషయాన్ని ఆ పుస్తకంలో పేర్కొన్నట్టు సుప్రీం తెలిపింది. అలాగే, హిందువుల ప్రార్థనా స్థలాలు, సీతా రసోయి, శ్రీరాముడు ఇక్కడే జన్మించాడని చెప్పడానికి ఉద్దేశించిన ఉయ్యాల వంటి అంశాలను కూడా ఆయన తన పుస్తకంలో ప్రస్తావించినట్టు సుప్రీం వెల్లడించింది. ఈ ప్రాంతాన్నే భక్తులు పెద్ద సంఖ్యలో రోజువారీగా సందర్శించేవారని కూడా స్టీఫెంట్‌ హేలర్‌ తన పుస్తకంలో పేర్కొన్నట్టు రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. అలాగే, ఐర్లాండ్‌ రచయిత రాబర్ట్‌ మాంట్‌గో మెరి మార్టిన్‌ తన పుస్తకంలో ఆలయాల విధ్వంసం, వాటి స్థానే మసీదుల నిర్మాణం గురించి కూడా పేర్కొన్నారని, ఆ అంశాలను కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామని సుప్రీం తెలిపింది.

 

Tags
  • Ayodhya dispute
  • Supreme Court
  • Verdict

Related News

  • Ap Advisor Sajjala Ramakrishna Reddy Interview

    విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్‍

  • Karikal Valaven Special Chief Secretary To Government Industries Commerce Interview

    పెట్టుబడులను ఆకర్షించేలా ఎపి ప్రభుత్వ చర్యలు

  • Ap Special Representative North America P Ratnakar Interview

    విద్య, వైద్యంలో ఎన్నారైల సహకారం తీసుకుంటాం

  • Apnrt Chiarman Venkat Medapati Interview

    ఎన్నారైలకు చేదోడువాదోడుగా ఉంటాం

  • Trs Working President Ktr Key Role In Trs Party

    మళ్ళీ చక్రం తిప్పుతున్న కేటీఆర్

  • Huzurnagar Bye Elections In Telangana

    హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో బీసీలు ఎస్సీలు ఎటువైపు?

Latest News
  • Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
  • Jalagam Sudheer: 25 యేండ్ల వీసాల అనుబంధం (2000 -2025)
  • Devagudi: ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదగా “దేవగుడి” ఫస్ట్ లుక్ లాంచ్
  • US: వన్ టైమ్ ఫీజు లక్ష డాలర్లకు పెంచిన అమెరికా.. టెక్ దిగ్గజాలు ఏం చేయనున్నాయి..?
  • White House: వన్ టైమ్ ఫీజు.. వార్షిక రుసుము కాదు.. హెచ్ 1బీ వీసాపై వైట్‌హౌస్‌ క్లారిటీ
  • Team India: ప్రాక్టీస్ కు సీనియర్ లు.. వీడియోలు వైరల్
  • BCCI: కొత్త సెలెక్షన్ కమిటీ..? సెలెక్టర్ గా ధోనీ ఫ్రెండ్..!
  • YS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?
  • Nandamuri: సీనియర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ప్లానింగ్..?
  • Gen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer