US Open : యూఎస్ ఓపెన్ తొలిసారి గ్రాండ్‌స్లామ్ .. క్వార్టర్స్‌కు యుకీ బాంబ్రీ

భారత టెన్నిస్ ఆటగాడు యుకీ బాంబ్రీ (Yuki Bhambri) తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. డబుల్స్‌లో తన సహచరుడు మైకెల్ వెనుస్ (Michael Venus) తో కలిసి యుకీ యూఎస్ ఓపెన్ (US Open) బరిలోకి దిగాడు. వీరిద్దరికి 14వ సీడ్ దక్కింది. అయితే, ప్రీక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ జోడీ కెవిన్ క్రావిట్జ్ -టిమ్ పూయిట్జ్ పై 6-4, 6-4 తేడాతో యుకీ జోడీ విజయం సాధించింది. దాదాపు గంటన్నరపాటు జరిగిన పోరులో పైచేయి సాధించారు. క్వార్టర్స్‌లో క్రొయేషియాకు చెందిన నికోలా మోక్టివ్ (Nicola Moktive) అమెరికా ప్లేయర్ రాజీవ్‌రామ్ (Rajiv Ram ) తో యుకీ మైకెల్ తలపడనున్నారు.