అమెరికా, రష్యా కంటే… మనమే ఎక్కువ
సామాజిక మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు మన దేశానికి చెందిన 22.5 లక్షల వీడియోలను గత ఏడాది అక్టోబరు-డిసెంబరు మధ్య యూట్యూబ్ తొలగించింది. ఈ విషయంలో 30 దేశాల్లో అగ్రస్థానంలో మన దేశం ఉంది. జాబితాలో రెండో స్థానంలో సింగపూర్ ఉంది. ఆ దేశానికి చెందిన 12.43 లక్షల వీడియోలను తొలగించారు. అమెరికా (7.88 లక్షలు), ఇండొనేసియా (7.70 లక్షలు), రష్యా (5.16 లక్షలు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీడియోలను అప్లోడ్ చేసిన దేశాల ప్రాతిపదికన గణాంకాలు నిర్ణయించారు.
ప్రపంచం మొత్తం మీద 90 లక్షలకు పైగా వీడియోలను 2023లో తొలగించారు. వీటిలో 96 శాతం దృశ్యాలను మనుషుల కంటే ముందుగా యంత్రాలే గుర్తించడం విశేషం. ప్రమాదకరమైన అంశాలు, పిల్లల భద్రత, హింసాత్మకమైన/ గ్రాఫిక్ జోడిరచిన అంశాలు, నగ్న/ అశ్లీల దృశ్యాలు, తప్పుడు సమాచారం. ఇలాంటివాటిని యూట్యూబ్ తొలగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2.05 కోట్ల ఛానళ్లను అక్టోబరు`డిసెంబరు మధ్య యూట్యూబ్ తొలగించింది.






