ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఇక లేరు
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్వుడ్ ఇంగ్లాండ్ లోని లివర్పూల్ నగర సమీపంలో గల శరణాలయంలో మృతి చెందారు. ఆగస్టు 26న తన 112వ పుట్టినరోజు జరుపుకొన్న జాన్ ఆల్ ఫ్రెడ్ గిన్నిస్ రికార్డుల ప్రకారం దాదాపు తొమ్మిది నెలలపాటు ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి హోదాలో ఉన్నారు. చారిత్రక విషాదమైన టైటానిక్ ఓడ మునిగిన 1912లో పుట్టిన ఈయన రెండు ప్రపంచ యుద్ధాల కాలంలో జీవించారు. రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటిష్ ఆర్మీలో పనిచేశారు. తన దీర్ఘాయుష్షుకు అచ్చంగా అదృష్టమే కారణమని ఆయన చెప్పేవారు.






