భారత్‌కు మరో 128 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ లు పంపిన యూఎస్ఐసీఓసీ

టెక్సాస్: కరోనాతో అల్లాడుతున్న భారత్‌కు అమెరికా నుంచి సాయం అందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ (యూఎస్ఐసీఓసీ) భారత్‌కు మరో 128 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపింది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి 85 వరకూ వెంటిలేటర్లు, 250 వరకూ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు భారత్‌కు చేరుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో 128 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు భారత్‌కు వచ్చాయి. ఇది యూఎస్ఐసీఓసీ నుంచి వచ్చిన ఐదో విడత సాయం. ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు మూడు రాష్ట్రాల్లోని ఎన్జీవోలు, ఆస్పత్రులకు చేరనున్నాయి. వీరితోపాటు బెంగళూరు మెడికల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు సహా 300 మంది వాలంటీర్లు ఉన్న మెర్సీ మిషన్‌కు కూడా ఈ సాయం అందనుందని సమాచారం. ఈ మెర్సీ మిషన్.. కర్ణాటక రాజధాని బెంగళూరు పరిసర ప్రాంతాల్లోని వలస కూలీలకు వైద్య సాయం అందిస్తోంది.
భారత్‌కు సహకారం అందించడం కోసం యూఎస్ఐసీఓసీ సహా టెక్సాస్‌లోని 20 కమ్యూనిటీ ఆర్గనైజేషన్లు, వ్యక్తులు, వ్యాపార సంస్థలు చేపట్టిన కార్యకలాపాలకు యూఎస్ఐసీఓసీ అధ్యక్షుడు నీల్ గోనుగుంట్ల నేతృత్వం వహిస్తున్నారు. తమతో కలిసి పనిచేసిన వారి కృషిని నీల్ గోనుగుంట్ల కొనియాడారు.