Visa: భారతీయులకు మరో షాక్.. తక్షణమే అమల్లోకి!

అమెరికా వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయులు (Indians) మరో చేదువార్త వెలువడింది. నాన్ – ఇమిగ్రెంట్ వీసా లకు దరఖాస్తుదారులు వారి స్వదేశాల్లో లేదా, లీగల్ రెసిడెన్సీ ఉన్నచోట్లే ఇంటర్వ్యూలకు షెడ్యూల్ చేసుకోవాలని అగ్రరాజ్యం తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఇంటర్వ్యూలు (Interviews) నిర్వహించని ప్రదేశాల్లో ఉన్నవారికి మాత్రమే దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ నిబంధన కారణంగా భారతీయులైన వ్యాపారులు, సందర్శకులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. వీరు బీ1, బీ2 వీసా లను స్వల్ప వ్యవధిలో పొందడం కష్టంగా మారవచ్చు. గతంలో వీరు వీసా (Visa) అపాయింట్‌మెంట్లను విదేశాల్లో బుక్ చేసుకొనే అవకాశం ఉండేది. ఇప్పుడు అది సాధ్యం కాదు. కొవిడ్-19 (Covid-19) సమయంలో ఈ వీసాల జారీలో తీవ్ర జ్యాపం ఏర్పడింది. తాజా నిబంధనలతో మళ్లీ అలాంటి పరిస్థితే తలెత్తవచ్చు.