America : చైనాకు 90 రోజుల ఉపశమనం : అమెరికా

ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధానికి మరో 90 రోజుల విరామం లభించింది. చైనాపై విధించిన ప్రతీకార సుంకాలను వాయిదా వేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేశారు. అదే సమయంలో ఇటు చైనా (China) సుంకాల వాయిదాను ప్రకటించింది. దీంతో రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకోవడానికి మరింత సమయం లభించినట్లయింది. ఈ ఏడాది ఆఖరులో డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్ (Jinping)ల మధ్య సమావేశం జరిగే అవకాశముంది. అప్పటికల్లా ఒప్పందం కుదిరే అవకాశముంది.