రష్యా ముందడుగు వేస్తే.. చైనాదే బాధ్యత : అమెరికా హెచ్చరిక
ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధంలో రష్యా ముందడుగు వేస్తే అందుకు చైనానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ బీజింగ్‌లో పర్యటించిన నేపథ్యంలో ఆగ్రదేశం నుంచి ఈ మేరకు స్పందన వచ్చింది. ఈ పర్యటన సందర్భంగా రష్యాలో సామాజిక భద్రత స్థిరత్వాన్ని కొనసాగించేందుకు తమ మద్దతు ఉంటుందని చైనా హామీ ఇచ్చింది. మరోపక్క ఉక్రెయిన్‌కు మరింత ఆయుధ సాయాన్ని ఆమోదించడంపై యూఎస్ కాంగ్రెస్‌లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అదే సమయంలో రష్యా తన దాడుల్ని తీవ్రతరం చేస్తోంది. ఈ క్రమంలో చైనా మద్దతు గురించి ఎదురైన ప్రశ్నకు యూఎస్ విదేశాంగ సహాయ మంత్రి కర్ట్ క్యాంపెబెల్ బదులిచ్చారు. ఉక్రెయిన్‌లో రష్యా ముందడుగు, ఐరోపాలో శక్తి సమతుల్యతను దెబ్బతీసే అవకాశాలున్నాయి. ఇదే విషయాన్ని ఇప్పటికే చైనాకు స్పష్టం చేశాం. ఇదే కొనసాగితే అమెరికా`చైనా సంబంధాలపై దీని ప్రభావం పడుతుంది అని హెచ్చరించారు.






