ఇరాన్‌కు అమెరికా, యూకే, జర్మనీ హెచ్చరిక
రష్యాకు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ సరఫరా చేస్తోందని అమెరికా, బ్రిటన్ ఆరోపించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో వాటిని రష్యా వాడనుందని పేర్కొన్నాయి. ఇది యుద్ధం తీవ్రతను పెంచడం ఖాయమని అభిప్రాయపడ్డాయి. లండన్‌లో అమెరికా, బ్రిటన్ విదేశాంగ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్, డేవిడ్ లామీ మీడియాతో మాట్లాడారు. అనంతరం అమెరికా, బ్రిటన్, జర్మనీ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. క్షిపణుల బదిలీ ఐరోపాకు పెద్ద ముప్పని అభిప్రాయపడ్డాయి. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలను విధిస్తామని, ద్వైపాక్షిక వైమానిక ఒప్పందాలను రద్దు చేసుకుంటామని స్పష్టం చేశాయి. ఇరాన్ గగనతలంపై ఆంక్షలను విధిస్తామని తేల్చి చెప్పాయి.






