అమెరికాలో మరోసారి కాల్పుల మోత… రెండు వేర్వేరు ఘటనల్లో
అమెరికాలో తుపాకీ విష సంస్కృతి మరో ముగ్గురిని బలి తీసుకుంది. రెండు వేర్వేరు ఘటనల్లో 10 మంది వరకు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వాషింగ్టన్లో గుర్తుతెలియని వ్యక్తి ఏడుగురిపై తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో అయిదుగురు గాయపడ్డారు. మరోవైపు ఇండియానా రాష్ట్రంలోని ఇండియానా పొలిస్ లోనూ కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానికంగా ఉన్న ఓ బార్లో దుండగుడు తుపాకీతో కాల్పులు జరపడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో అయిదుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.






